వారెవ్వా.. గుమ్మడికాయ పడవతో గిన్నిస్‌ రికార్డు

50చూసినవారు
అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్‌ భారీ గుమ్మడి కాయ పడవతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నాడు. కొలంబియా నదిలో 26 గంటల్లో ఏకంగా 73.50 కిలోమీటర్లు ప్రయాణించాడు. గుమ్మడికాయ బోటులో అత్యంత దూరం ప్రయాణించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గత నెల 31న గిన్నిస్‌ రికార్డ్స్‌ బృందం ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందించింది. నది మధ్యలో భారీగా మొక్కలు ఉండటంతో ప్రయాణం చాలా కష్టతరమైందని గ్యారీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్