AP: రాష్ట్రంలో 60% యువతకు అప్పులున్నాయి. ఎలాగో అనుకుంటున్నారా.. ప్రభుత్వం చేసిన అప్పుల ప్రకారం రాష్ట్రంలో లక్ష మందిలో సరాసరి 60వేల మందికి అప్పులున్నట్లు కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన రిపోర్టులో తేలింది. దేశంలోనే మరే రాష్ట్రమూ మన దారిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. జులై 2022-జూన్ 2023 మధ్య నిర్వహించిన నమూనా సర్వేలో కేంద్ర గణాంక సంస్థ ఈ వివరాలు వెల్లడించింది.