ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. తనపై ఈడీ, సీబీఐ విచారణలను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టుకు పిటిషన్ వేశాడు. దాంతో ఆయన వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఈడీ, సీబీఐల విచారణలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది.