AP: నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరపు న్యాయవాది రైల్వే కోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. శనివారం నుంచి ట్రైనింగ్‌కు వెళ్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే సినీ ఫ్యాన్స్, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని నటుడు పోసాని పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.