దారుణం.. పిల్లిని కాపాడబోయి ఐదుగురు దుర్మరణం

72080చూసినవారు
పిల్లిని రక్షించబోయి ఐదుగురు దుర్మరణం చెందిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ లోని వాడ్కి గ్రామంలో పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లిని కాపాడే క్రమంలో ఒకరు బావిలో దూకగా, ఆ తర్వాత ఒకరి కోసం ఒకరు దూకినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఆరుగురు బావిలో దూకగా నడుముకి తాడు కట్టుకొని దూకిన చివరి వ్యక్తిని రక్షించినట్లు వెల్లడించారు. ఆ బావిని బయో గ్యాస్ కోసం వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్