తమ దేశంపై క్షిపణి దాడులు చేసిన ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఇరాన్ చమురు కేంద్రాలే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై చర్చిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. దీంతో ఇరాన్ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి.