ఇరాన్ తీరానికి 25 కి.మీ. దూరంలో ఉన్న ఖర్గ్ అనే చిన్నదీవి ఇరాన్‌కు ఆయువుపట్టు. ఇక్కడ నుంచే భారీ ఎత్తున పెట్రో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలో పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు ఇక్కడ నుంచి సరఫరా జరుగుతుంది. దీనిని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే దాడి జరిగిన వెంటనే ఒక్కసారిగా 5 శాతం చమురు ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థల అంచనా. గతంలో ఇరాన్-ఇరాక్ యుద్ధంలోనూ సద్దాంహుస్సేన్ సేనలు ఈ దీవిపై దాడులు జరిపాయి.