‘డాకు మహారాజ్’ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ బాలయ్య కటౌట్లకు పూలు, పాలాభిషేకం చేశారు. అయితే ఇదంతా బాలకృష్ణ ప్రతీ సినిమాకు జరిగేదే. కానీ ఈసారి బాలయ్య ఫ్యాన్స్ రక్తం కళ్ల చూశారు. సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఓ థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు. దాని రక్తాని అద్ది ‘డాకు మహారాజ్’ పోస్టర్‌కు రుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మూగ జీవాలను అలా బలివ్వడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.