మహారాష్ట్రలోని వాసాయిలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఆరేళ్ల బాలుడి పై నుంచి కారు దూసుకెళ్లినా బాలుడికి ఏం కాలేదు. బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒకతను కారును తీసే క్రమంలో బాలుడి పై నుంచి వెళ్లాడు. అయితే ఈ ప్రమాదంలో బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. బుడ్డోడికి స్వల్పగాయాలు కాగా స్నేహితులు వచ్చి అతడిని తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీఫుటేజీలో రికార్డు కావడంతో వైరల్ గా మారాయి.