చాలా మందికి పాదాల్లో మంట, తిమ్మిర్లు వస్తుంటాయి. అయితే ఇవి సాధారణ సమస్యే అని కొంతమంది లైట్ తీసుకుంటుంటారు. కానీ, పాదాల్లో మంటలు రావటం మధుమేహానికి కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, శరీరంలో ఎర్ర రక్త కణాలు, విటమిన్ బి లోపం, కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవటం, రక్తంలో టాక్సిన్స్ పేరుకుపోయి పాదాల్లో మంటలు వస్తాయంటున్నారు. కాగా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.