దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో వాహనాలు మందకొడిగా కదులుతున్నాయి. దీనికి తోడు పొగమంచు అలుముకోవడంతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాది, ఢిల్లీ వైపు వెళ్లే 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలిసింది. ఇక ఇంధిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాలు ఆలస్యంగా టేకాఫ్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది.