పచ్చి అరటికాయలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయల్లో పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చి అరటికాయలను తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇంకా పచ్చి అరటిపండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలను దూరం చేస్తుంది.