పుట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుకులు చూశానని నటుడు విక్రమ్ తెలిపారు. తన కాలేజీ రోజుల్లో జరిగిన ఓ యాక్సిడెంట్ ను ఆయన గుర్తుచేసుకున్నారు. 'నేను నాలుగేళ్లు నడవలేదు, 23 సర్జరీలు చేయించుకున్నా.. వైద్యులు నా కాలును తొలగించాలనుకున్నారు' అని చెప్పారు. 'సినిమా ఛాన్స్ కోసం 10 ఏళ్లు ఎదురుచూశా. నడవలేని స్థితిలో ఉండి సూపర్ స్టార్ ను అవుతానని నా భార్యతో అన్నప్పుడు భ్రమలో ఉన్నాననుకుంది," అని ఆయన అన్నారు.