అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

52చూసినవారు
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు అదుపుతప్పి కుంటలోకి దూసుకెళ్లిన ఘటన తెలంగాణలోని జనగామ జిల్లాలో జరిగింది. స్థానిక బతుకమ్మ కుంట పక్కన ఉన్న గ్రౌండ్ లో ఓ వ్యక్తికి మరొకతను కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. ఆ సమయంలో అయోమయానికి గురైన డ్రైవర్ బ్రేక్ కి బదులు యాక్సిలరేటర్ తొక్కినట్లు తెలుస్తోంది. దీంతో కారు నేరుగా చెరువులోకి దూసుకెళ్లింది. వారిద్దరూ వెంటనే కారులోంచి చెరువులోకి దూకేశారు. స్థానికుడు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.

సంబంధిత పోస్ట్