మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఈశా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ ఫౌండేషన్‌పై నమోదైన కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారం మూసేసింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ నెలకొల్పిన ఈశా ఫౌండేషన్‌లో తన కుమార్తెలను బంధించారని కోయంబత్తూరు అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కామరాజ్.. మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది.