IPL వ్యవస్థాపకుడు లలిత్ మోడీ.. తాను దేశాన్ని విడిచి వెళ్లిపోవడంపై కీలక విషయాలు బయటపెట్టారు. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులతోనే దేశం విడిచి పోయినట్లు తెలిపారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ ఈ విషయాలు వెల్లడించారు. ‘దావూద్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్నాడు. నాకు ప్రాణహాని కల్పించేందుకు దావూద్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు’ అని పేర్కొన్నారు.