AP: మున్సిపల్ శాఖపై సీఎం చంద్రబాబు సచివాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. టౌన్ ప్లానింగ్‌లో సమూల మార్పులు చేయడానికి వేసిన కమిటీల రిపోర్టులు సీఎంకు అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఒక ప్లాన్‌కు దరఖాస్తు చేయడానికి అన్ని రకాల డిపార్ట్మెంట్‌ల అనుమతులకు సింగిల్ విండో విధానం అమల్లోకి రాబోతోందని తెలిపారు. ఈ సింగిల్ విండో అనుమతుల విధానం డిసెంబర్ 31 నుంచి అమల్లోకి వస్తుందని మంత్రి వెల్లడించారు.