మారుతి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు (వీడియో)
AP: ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. మచిలీపట్నం సమీపంలోని బందరు కోటలో శ్రీశాంతి నమ్రమారుతి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఆలయంలో ఉన్న శివలింగం, వినాయకుడు, కుమార స్వామి విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.