తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు చలి పెరుగుతుంటే.. మరోవైపు పొగమంచు కురుస్తుంది. అయితే ఈ పొగమంచులో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
1. మంచు పడుతున్నప్పుడు ఫాగ్‌లైట్లు తప్పనిసరిగా ఉపయోగించాలి.
2. ఉదయం 8 గంటలు దాటిన తర్వాత సొంత వాహనాల్లో ప్రయాణాలు మొదలుపెట్టాలి.
3. వైపర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? బ్రేకులు సమస్యల్లేకుండా పడుతున్నాయా? అని చెక్ చేసుకోవాలి.
4. ఒకవేళ దట్టమైన మంచుతో ముందుకు సాగలేని పరిస్థితి ఉంటే కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడం మంచిది.