శ్రీ మలయప్ప స్వామివారు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు నారాయణవనంలో వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరారట. అయితే వచ్చే దారిలో అప్పలాయగుంట దగ్గర ఆగారట. అక్కడ తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామి వారిని ఆశీర్వదించి, ఆ ఆలయంలో కొలువు దీరాడట. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన స్వామివారు తొండవాడలోని అగస్త్యేశ్వరుని దర్శించారట. అనంతరం శ్రీనివాస మంగాపురంలో ఆరు నెలలు ఉండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని పురాణాలు చెబుతున్నాయి.