రైలులో మీకు కన్ఫామ్ అయిన సీటులో మరొకరు కూర్చున్నారా.. ఇలా చేయండి

74చూసినవారు
రైలులో మీకు కన్ఫామ్ అయిన సీటులో మరొకరు కూర్చున్నారా.. ఇలా చేయండి
రైలులో రిజర్వేషన్ చేసుకున్న సీటులో వేరేవారు కూర్చుని, ఖాళీ చేయకపోతే సదరు ప్రయాణికుడు టీటీఈ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్)ని సంప్రదించవచ్చు. అలాగే రైల్ మదద్ (RailMadad) పోర్టల్/యాప్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. యాప్‌లో ఫిర్యాదు అందాక సీటును టీటీఈ ఖాళీ చేయిస్తారు. ఫిర్యాదు వచ్చిన 28 నిమిషాల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.

సంబంధిత పోస్ట్