కొన్ని వీడియోలు మనల్ని అమిత ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అరే ఇలా ఎలా జరిగింది అంటూ ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో డ్రైవర్ లేకుండానే ఓ ఆటో రయ్ మంటూ వెళుతోంది. వెనుక వస్తున్న వ్యక్తి ఈ ఘటనను రికార్డ్ చేశాడు. అయితే, డ్రైవర్ లేకుండా ఇలా ఎలా వెళుతోంది అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.