బెనిఫిట్ షోలు ఉండవు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పినదానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని టాలీవుడ్ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు. సినిమా ఈవెంట్లకు సంబంధించి పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు.