సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ.. చిరంజీవి దూరం

61చూసినవారు
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ.. చిరంజీవి దూరం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాలేదు. మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండటం కారణంగానే సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్, త్రివిక్రమ్, నాగార్జున, హరీశ్ శంకర్, మురళీ మోహన్, శ్యాం ప్రసాద్ రెడ్డి, శివ బాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, ఎలమంచిలి రవి, కిరణ్ అబ్బవరం తదితరులు భేటీలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్