ఎర్ర తోటకూరతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర తోటకూరలో విటమిన్ A, C, E, B, కాల్షియం, కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఎర్ర తోటకూరను తింటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిలో ఉండే ఫైబర్.. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.