శామ్‌సంగ్‌ ఇండియా ఆదాయం రూ.లక్ష కోట్లు

80చూసినవారు
శామ్‌సంగ్‌ ఇండియా ఆదాయం రూ.లక్ష కోట్లు
శామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,188.7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23లో ఆర్జించిన రూ.3,450.1 కోట్ల లాభంతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.96,632.4 కోట్ల నుంచి 3% పెరిగి రూ.99,541.6 కోట్లకు చేరింది. ఇతర ఆదాయంతో కలుపుకుంటే, సంస్థ మొత్తం ఆదాయం రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించి రూ.1,02,628.3 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్