తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ఖిలా వరంగల్లోనూ చారిత్రక కట్టడాల విశేషాలను ప్రజలందరూ తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తుశాఖ అధికారులు QR కోడ్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. ఆయా నిర్మాణాల వద్ద వాటి సమాచారం పొందేలా.. QR కోడ్లను అందుబాటులో ఉంచారు. ఆ కోడ్ను సెల్ఫోన్లో స్కాన్ చేసి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో కాకతీయుల చరిత్ర, ఆలయాల విశేషాలు, ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకోవచ్చు.