గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో బాలుడిని తోటి విద్యార్థులే చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అమరావతి మండలం కర్లపూడికి చెందిన షేక్ సమీర్ స్థానిక జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అదే తరగతికి చెందిన కొంతమంది విద్యార్థులు తరచూ సమీర్‌తో గొడవ పడేవారు. ఈ క్రమంలో గత నెల 24న ఈత కొడదామని సమీర్‌ను తీసుకెళ్లి కొట్టి బావిలోకి తోసేసినట్లు సమాచారం. దీనిపై డీఈవో రేణుక స్పందిస్తూ విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.