నేటి నుంచి కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు
ఢిల్లీలో నేటి నుంచి 2 రోజులపాటు కృష్ణా ట్రిబ్యునల్‌లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. తెలంగాణకు నీటి కేటాయింపులు విషయంలో బలమైన వాదనలు వినిపించాలన్నారు. అలాగే, ISRWDA-1956 సెక్షన్-3ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గోదావరి-బనకచర్లపై అభ్యంతరాలతో జల్‌శక్తి మంత్రి, ఏపీ సీఎంకు లేఖలు రాయాలని తెలిపారు. పోలవరం ముంపుపై నిర్దేశిత సమయంలో ఐఐటీతో అధ్యయనం చేయాలని సూచనలు చేశారు.