ఇస్రో మరో ఘనత సాధించింది. ISRO ప్రవేశపెట్టిన రెండు ఉపగ్రహాల డాకింగ్ పూర్తయింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా డిసెంబర్ 31న రెండు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే.