లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్ డెడ్ (వీడియో)

73చూసినవారు
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరి మున్సిపాలిటీ రాయగిరి సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబందించిసంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్