AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు హైకోర్టు పిన్నెల్లికి అనుమతి ఇచ్చింది. తాను సింగపూర్ వెళ్లేందుకు బెయిల్ షరతుల్ని సడలించాలని ఇటీవల పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. కాగా, ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.