మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్న సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ సమీపంలోని అమిస్తాపూర్ లో సభ స్థలాన్ని అధికారులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు.