ఏపీకి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదివారం విమర్శలు గుప్పించారు. "రాజకీయాలు అంటే సంపాదన అని జగన్ అనుకుంటారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆయన వల్ల ఐదేళ్ల విలువైన సమయం కోల్పోయాము. అక్రమాలు చేసేవారికే ఆయన పెద్దపీట వేస్తారు. ప్రజలను కులాలు, వర్గాలుగా విడదీస్తారు." అంటూ జగన్‌పై ఏబీ వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు.