
తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
భారత రైల్వే శాఖ తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పు చేసిదంటూ సోషల్ మీడియా ఓ వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై కేంద్రం స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలను నమ్మోదంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఏసీ, నాన్ ఎసీ, స్లిప్లర్ కోచ్ బుకింగ్ సమయాల్లో ఏలాంటి మార్పు లేదని తెలిపింది. యథావిధిగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది.