
ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP: ఈనెల 18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సీఎం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించనున్న తెలుస్తోంది. అమరావతి అభివృద్ధికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లు సమాచారం.