ఏపీలో రేపటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులకు బెస్ట్ విషెస్ తెలిపారు. "టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న నా యువ నేస్తాలందరికీ శుభాకాంక్షలు. విద్యా ప్రస్థానంలో పరీక్షలనేవి కీలక మైలురాళ్లు. పరీక్షలపైనే దృష్టి పెట్టండి. గట్టిగా కృషి చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీపై మీకు నమ్మకం ఉండాలి. విజయం దానంతట అదే వరిస్తుంది" అంటూ సీఎం ట్వీట్ చేశారు.