TG: మెదక్ జిల్లా రామాయంపేట మండలం లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.