
గంటల వ్యవధిలో కూలిన రెండు వాయుసేన విమానాలు
ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రాలో శుక్రవారం ఏఎన్-32 విమానం కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హర్యానాలోని పంచకులలో జాగ్వార్ యుద్ధ విమానం కూలిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే జాగ్వార్ యుద్ధ విమానం ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది.