దారుణం.. తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

52చూసినవారు
దారుణం.. తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్‌లో తల్లిని కన్నకొడుకే గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్