TG: ప్రజాప్రయోజనాలు కాపాడేందుకు మరింతగా పోరాడదామని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ సమాజ రాజకీయ అస్తిత్వ పార్టీ అని అయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు రక్షణ కవచం BRS అని పేర్కొన్నారు. రజతోత్సవ వేడుకలో తెలంగాణ సమాజమంతా భాగస్వాములేనని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజాప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పి కొట్టాలన్నారు.