మంచు విష్ణుకు సీపీ వార్నింగ్
హీరో మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి గొడవలు పునరావృత్తం అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాదాపు గంటన్నర సేపు విష్ణును సీపీ సుధీర్ బాబు విచారించారు. నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని విష్ణును సీపీ హెచ్చరించారు. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో బాండ్ పేపర్లపై విష్ణు సంతకాలను తీసుకున్నారు.