తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ ‘మంథన్’ తీసింది ఆయనే..

69చూసినవారు
శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జీవిత కథ ఆధారంగా బెనెగల్ తెరకెక్కించిన చిత్రం 'మంథన్'. దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఆలోచనకు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకొచ్చింది. దీంతో, ఇందులో భాగస్వాములుగా ఉన్న 5 లక్షల మంది రైతులు రూ.2 చొప్పున ఇచ్చారు. ప్రపంచంలో ఇంత ఎక్కువమంది నిర్మించిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమాగా 'మంథన్' రికార్డు సృష్టించింది. మన దేశంలో ప్రజా విరాళాలతో నిర్మించిన తొలి సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్