ప్రఖ్యాతిగాంచిన బెనగళ్ల శ్యామసుందరరావు నిర్మించిన ప్రతి చిత్రానికీ అవార్డులు వచ్చాయి. 1962లో తొలి డాక్యుమెంటరీ (గుజరాతీ) రూపొందించారు. దశాబ్దం తర్వాత నిర్మించిన ‘అంకుర్’కు సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో జాతీయ అవార్డు అందుకుంది. 'నిషాంత్', 'మంథన్', 'భూమిక', 'సమర్', 'హరి- భరీ', 'మండి'.. ఇలా బెనెగల్ దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలు అవార్డు దక్కించుకోవడం విశేషం. ఆయన తీసిన చివరి చిత్రం 'ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్'.