హర్యానాలో హిసార్ జిల్లా బుడానా గ్రామంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇటుక బట్టీ గోడ కూలి నిద్రిస్తున్న చిన్నారులపై పడింది. దీంతో అభం శుభం తెలియని నలుగురి చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చనిపోయిన చిన్నారులలో సూరజ్ (9), నందిని (5), వివేక్ (9), మూడు నెలల చిన్నారి నిషాగా గుర్తించారు. మరోవైపు గౌరీ (5) అనే చిన్నారికి తీవ్ర గాయాలవ్వగా.. ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.