ఢిల్లీలోని చంద్ర విహార్ ప్రాంతంలోని చంద్ర విహార్ ఎస్డిఎం స్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి ఓ భారీ సైజు కొండచిలువ కనిపించింది. దీంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. కొందరు అటుగా వెళ్తున్న జనం పెద్ద ఎత్తున కొండచిలువను చూసేందుకు ఆగారు. దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ అవుతోంది. స్థానికులు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు.