వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు మహిళా నాగసాధు అఘోరి పర్యటిస్తున్నారు. తిమ్మాపూర్ క్రాస్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి నుంచి భద్రకాళి ఆలయం వరకు ఆమె పాదయాత్ర నిర్వహించారు. అఘోరి తన వాహనాన్ని నిరాకరించి వరంగల్ ఫ్లైఓవర్, బట్టల బజార్ మీదుగా భద్రకాళి టెంపుల్కు పాదయాత్ర కొనసాగుతోంది. అఘోరిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.