నిరుద్యోగులకు శుభవార్త.. 16,347 ఉద్యోగాలు

76చూసినవారు
నిరుద్యోగులకు శుభవార్త.. 16,347 ఉద్యోగాలు
AP: నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. త్వరలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా ఆన్‌లైన్‌లో డీఎస్సీ కోచింగ్‌ అందజేస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి, నిపుణులతో తరగతులు నిర్వహించి ప్రశ్నపత్రాలు, మోడల్ పేపర్లను అందుబాటులోకి తెస్తామన్నారు. బీఈడీతో పాటు టెట్‌లో అర్హత సాధించిన వారు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్‌కు అర్హులని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్