భార్య తిట్టిందని బావిలో దూకి సూసైడ్ చేసుకున్న భర్త (వీడియో)

368634చూసినవారు
ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అనవసరమైన కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల పట్టణానికి చెందిన నరేశ్ ను అతని భార్య తిట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నరేశ్, అల్లమయ్యగుట్ట బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీశారు.