సచిన్ టెండూల్కర్ స్థాపించిన తన ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సచిన్ భార్య అంజలి టెండూల్కర్, తన కూతురు సారా రాజస్థాన్లో కొత్తగా క్లినిక్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రాజస్థాన్లోని సరిగ్గా పోషణ అందని చిన్నారులకు ఆహారాన్ని అందించారు. ఇంకా నిరుపేదలతో కలిసి ఆడి, పాడి సరదాగా గడిపారు. అయితే ఈ విషయాన్ని తన ఇన్స్టాలో సారా వెల్లడించారు.